Friday, June 21, 2013

హోమర్ ,Homer




హోమర్ (Homer) ఒక ప్రాచీన గ్రీకు ప్రబంధక కవి, సాంప్రదాయికంగా ప్రబంధక కవితలైన ఇలియడ్ మరియు ఒడిస్సీ ల రచయిత. హోమర్ గ్రుడ్డివాడు. అతడు కవితలను తన వాక్కుల ద్వారా చెబితే దానిని కొందరు వ్రాసిపెట్టారు. కొందరైతే, హోమర్ అనేకవి జీవించి యుండలేదు, అతని పాత్ర కాల్పనికమని, అతని పేరున ఎవరో ఈ కవితలను సృష్టించారని వాదిస్తారు. ప్రస్తుత కాలంలో ఈ కవితలను "నోటి-కవితలు" అని సంబోధిస్తూ, దీని ఉత్కృష్ట స్థితిని కొనియాడుతున్నారు. కొందరైతే ఈ కవితలు ఒక కవి సృష్టి కావని, కొందరు కవులు కలిసి ఈ కవితలను వ్రాసారని వాదిస్తున్నారు. హోమర్ జీవించిన కాలం గురించి అనేక కథనాలున్నాయి. హెరెడోటస్ ప్రకారం, తనకంటే 400 సంవత్సరాల పూర్వం జీవించాడని, అనగా దాదాపు క్రీ.పూ. 850 లో జీవించాడు. కొన్ని ప్రాచీన ఆధారాల ప్రకారం ట్రోజాన్ యుద్ధకాలానికి దరిదాపు వాడని. ఎరాటోస్థీన్స్ ప్రకారం, ట్రోజాన్ యుద్ధం క్రీ.పూ. 1194–1184 లో జరివినది. పురావస్తు శాస్త్రం ప్రకారమూ ఈ తేదీ ధృవీకరింపబడుతున్నది.

మూలము : వికీపిడియా.
  • ==========================
Visit my Website : Dr.Seshagirirao.com


No comments:

Post a Comment

Thanks for your comment.